![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -280 లో... రాహుల్, రుద్రాణి లు ప్లాన్ చేసి అరుణ్ ని గుడికి రప్పిస్తారు. " ఒక స్వప్నకి మాత్రమే కన్పించాలి అప్పుడు స్వప్న నీ వెనకాలే వస్తుంది. నువ్వు అక్కడ నుండి వెళ్లిపోవాలి " అని రాహుల్ అరుణ్ కీ చెప్తాడు. మరొక వైపు కావ్య గుడి చుట్టు నూట ఎనమిది ప్రదక్షిణలు చేస్తుంటుంది. రాజ్ లెక్కిస్తూ ఉంటాడు.
మరొకవైపు గుడిలో కాయిన్స్ నిలపేడితే అనుకున్నవన్ని జరుగుతాయన్న ఆశతో అనామిక, స్వప్న, కనకం లు కాయిన్ నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. స్వప్నకి అరుణ్ కనిపించేలా నిల్చొని హయ్ చెప్తాడు.. వీడేంటి ఇక్కడ ఉన్నాడని స్వప్న కోపంగా అక్కడ నుండి అరుణ్ వెంట వెళ్తుంది. అప్పుడే కనకం పెడుతున్న కాయిన్ కిందపడిపోతుంది. కనకం డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత అనామిక కాయిన్ నిలబెడుతుంది దాన్ని ఎవరు చూడకముందు కనకం కిందపడేస్తుంది. అనామిక డిస్సపాయింట్ గా వెళ్లిపోతుంది. మరొకవైపు అరుణ్ వెనకాలే స్వప్న వెళ్తుంటుంది. మరొకవైపు కావ్య ప్రదక్షిణలు చేస్తు.. కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఆ తర్వాత రాజ్ ఎత్తుకొని కావ్య చేత ప్రదక్షిణలు చేపిస్తాడు. అది చూసిన ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు.. కళ్ళు తిరిగి కిందపడిపోయింది అందుకే ఇలా చేశానని రాజ్ చెప్తాడు. మంచి పని చేసావంటు ఇందిరాదేవి అంటుంది. అందరూ స్వప్న ఎక్కడ కన్పించడం లేదని అనుకుంటారు. ఆ తర్వాత అరుణ్ కోసం స్వప్న వెతికే పనిలో అమ్మవారి ముందు ఉన్న శూలంపై పడిపోబోతుంటే అపర్ణ వచ్చి కాపాడుతుంది. ఆ తర్వాత అపర్ణకి స్వప్న థాంక్స్ చెప్తుంది. ఎందుకు ఒక్కదానివే ఇక్కడ ఉన్నావని అడుగగా ఆ అరుణ్ వచ్చాడు వాన్ని నాలుగు ఉతికి మీకు నిజం చెప్పించాలని అనుకున్నానని స్వప్న అనగానే.. అలాంటివేం చేయకు టెస్ట్ చేద్దామని అనుకున్నామని కదా అని ఇందిరాదేవి అంటుంది.
ఆ తర్వాత ప్లాన్ అంత ఫెయిల్ అయిందని రాహుల్ , రుద్రాణి లు డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత అందరు కలిసి దేవుడికి పూజ చేయిస్తారు. అందరు కళ్ళు మూసుకుని దేవుడికి మొక్కుతుంటే అప్పుడే శ్వేతా చాటుగా రాజ్ దగ్గరికి వస్తుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని రాజ్ కంగారు పడతాడు. తనేనా నీ భార్య.. నువ్వు శివయ్య.. నేను గౌరమ్మ తను గంగా అని శ్వేత అంటుంది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని తనని రాజ్ పంపిస్తాడు. కావ్య వెంటనే కళ్ళు తెరిచి ఎవరితోనో మాట్లాడుతున్నారని రాజ్ తో అనగానే.. లేదు మొక్కుకుంటున్న అని రాజ్ అంటాడు. ఆ తర్వాత అందరు కోనేటిలో దీపాలు వదులుతుంటారు. అప్పుతో కళ్యాణ్ మాట్లాడుతుంటే.. అనామిక వాళ్ళ అమ్మ చూసి అనామికకి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారని చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |